ఇలాంటి ముచ్చటైన ఫ్యామిలీని మీరు ఎప్పుడూ చూసి ఉండరు!

Dad Dog Brought Snack To Exhausted Mom Dog Watch This Interesting Video - Sakshi

మూగ జీవాల ప్రేమానుబంధాలు ఒక్కోసారి అమితాశ్చర్యాలకు గురయ్యేలా చేస్తాయి. అరే.. మనుషులమైన మనమే అంత ఇదిగా ఉండమే అనిపిస్తుంది. తాజాగా అటువంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత వింతగా అవేం చేశాయో మీరు కూడా ఓ లుక్కెయండి.

ఈ వీడియోలో కిటికీ పక్కన బెడ్‌షీట్‌పై కూర్చుని పప్పీలకు పాలు ఇస్తున్న తెల్ల కుక్క కనిపిస్తుంది. నల్లకుక్క (బహుశా పప్పీల నాన్నేమో) నడుచుకుంటూ దాని దగ్గరకు వచ్చి తినడానికి స్నాక్స్‌ పక్కన పెడుతుంది. పిల్లల సంరక్షణలో అలసిన తల్లికుక్క దాన్ని ఆబగా తింటుంది. ఆ తర్వాత ఒకదానిమరొకటి ఆలింగనం చేసుకుని పడుకోవడం కనిపిస్తుంది.

చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్‌ కదూ..

ముచ్చట గొలిపేలా ఉన్న ఈ కుక్కల ప్రవర్తన జంతు ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తోంది. ఇంకేముంది కామెంట్ల రూపంలో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘అద్భుతం ఇప్పటివరకూ నేను చూసిన వాటిల్లో ఇదే స్వీటెస్ట్‌ ఫ్యామిలీ’ అని ఒకరు కామెంట్‌ చేస్తే, ‘కుటుంబాన్ని హత్తుకున్న మంచి అబ్బాయి’ అని మరొకరు సరదాగా కామెంట్‌ చేశారు. ఏదేమైనా జంతువులకు కూడా కుటుంబం పట్ల అనురాగ ఆప్యాయతలు ఉంటాయనిపించేలా ఉ‍న్న ఈ వీడియోని వేల మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు. 

చదవండి: Old viral video: పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top