ఇంట్లో నుంచే లక్షలు సంపాదించండి! ప్రకటనల వలతో...

Cybercrime Prevention Tips To Stay Secure From Online Job Fraud - Sakshi

ప్రకటనల బుట్టలో పడవద్దు 

Cybercrime Prevention Tips In Telugu By Expert: యాప్స్‌ ఆధారంగా పార్ట్‌ టైమ్‌ జాబ్‌ ఆఫర్లతో స్కామర్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు ఆదాయం కోసం చూస్తున్న వారికి, నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులను ట్రాప్‌ చేయడానికి యాప్‌ స్కామర్లు ఉపయోగిస్తున్న ఆఫర్‌ మోసాలు పలు విధాలుగా ఉంటున్నాయి. 

‘ఆన్‌లైన్‌లో సంపాదించండి’, ‘పార్ట్‌ టైమ్‌ జాబ్‌’ వంటి ఆశావహమైన పదాలను మోసగాళ్లు, నేరస్థులు తమ ప్రకటనల ద్వారా ఉపయోగిస్తారు. ఈ సైట్‌లలో చాలా వరకు మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌కు లేదా మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ లింక్‌ను పొందుపరిచిన వెబ్‌సైట్‌కి మనల్ని దారి మళ్లిస్తాయి.

అలాగే, కొందరు తాము మోసపోయామని తెలిసి కూడా కావాలని మరో పదిమంది మోసపోవాలనుకుంటారు. దీంతో ఫలానా యాప్‌లలో పెట్టుబదులు పెట్టమని ప్రోత్సహిస్తుంటారు. వీటివల్ల మోసపోయే అవకాశాలూ అధికంగా ఉన్నాయి కాబట్టి, ఎవరికి వారు జాగ్రత్తపడటం అవసరం. 

ఇవీ సూచనలు... పార్ట్‌ టైమ్‌ జాబ్‌ స్కామ్‌ సూచికలు.. 
►ఇంటి నుండి ఉచిత పని
►త్వరితంగా డబ్బు సంపాదించడం
►అపరిమిత సంపాదన సామర్థ్యం
►బహుళ స్థాయి మార్కెటింగ్‌
►పెట్టుబడి అవకాశాలను పెంచడం
►ఫుల్‌ టైమ్‌ వేతనంతో కూడిన పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల ఎర 

మోసగాళ్లు అనుసరించే విధానాలు
1) బాధితులు పార్ట్‌ టైమ్‌ జాబ్‌ ఆఫర్‌లు, ఇంటర్నెట్‌/ మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లు మొదలైన ఇతర ప్రకటనలకు ఆకర్షితులవుతుంటారు. వీరి ఆశను అవకాశంగా తీసుకొని తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందని, అధిక కమీషన్లు‌ లేదా అధిక రాబడి వస్తుందని స్కామర్లు వాగ్దానం చేస్తారు. ప్రకటనలు /ఎసెమ్మెస్‌ల ద్వారా సాధారణంగా ఒక లింక్‌ ఉంటుంది, ఇది నేరుగా టెలిగ్రామ్‌ లేదా వాట్సప్‌ చాట్‌లో చేరమని వారిని అడుగుతుంది. 

2) APK (Android), DMZ (IOS) పై క్లిక్‌ చేయడం ద్వారా యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తారు. ఈ అప్లికేషన్స్‌ ప్లే స్టోర్‌ లేదా యాప్‌స్టోర్‌లలో లేవని గమనించాలి. గ్రూప్స్‌లో చాలా మంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు (యూట్యూబ్‌ వీడియోలు) వీటిని చూస్తారు.

వారు ఈ యాప్‌లను ఉపయోగించి చాలా ఎక్కువగా ప్రయోజనం పొందామని తమ ‘మల్టీలెవల్‌ మార్కెటింగ్‌‘ వ్యూహంలో భాగంగా సూచిస్తుంటారు. ఈ యాప్‌ల ద్వారా లబ్ది పొందామనో, ఈ మొత్తంతో వస్తువులను కొనుగోలు చేయడంలో, పనులను చేయడం ద్వారా ఆఫర్లతో పాటు 200 శాతం ప్రయోజనం పొందుతారని చెబుతుంటారు.

3) ఒక పని చేయడానికి తప్పనిసరి షరతు ఏమిటంటే, మనదేశంలో పనిచేయడానికి అధికారం లేని చెల్లింపు గేట్‌వేల ద్వారా ఆ డబ్బు ఇస్తామని ఉంటుంది.
4) పని పూర్తయిన తర్వాత, బాధితుడు డబ్బును విత్‌డ్రా చేసే అవకాశాన్ని ఇవ్వమని అడుగుతాడు. అయితే, వివిధ చెల్లింపు అగ్రిగేటర్ల ద్వారా డబ్బు తీసుకోవడానికి వీలుపడదు. 

5) మొదటిసారి డబ్బు పొందాక, బాధితుడు ఎక్కువ డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి, మరిన్ని పనులు చేయడానికి ఆకర్షితుడవుతాడు. ఫలితంగా ఈ ప్రక్రియ మళ్లీ కొనసాగుతుంది. అయితే, బాధితుడు పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత, స్కామర్‌ చాట్‌లో కనిపించడు.
 
మరింత అప్రమత్తత అవసరం
►యాప్‌ ఆదాయంలో సరైన నియంత్రణ/అనుకూల ఆమోదం కోసం అడగండి.
►ముందస్తుగా చెక్కులు ఇవ్వవద్దు.
►ఖాతా స్టేట్‌మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
►‘ప్రామిస్డ్‌ వర్సెస్‌ యాక్చువల్‌’ సందేశాలను నమ్మద్దు.
►యాప్‌ స్టోర్‌ / ప్లే స్టోర్‌ నుండి కాకుండా డౌన్‌లోడ్‌ చేసిన యాప్‌లపై ఆర్థిక లావాదేవీలు చేయవద్దు.
►ఫోన్‌ సంభాషణల సమయంలో లేదా స్క్రీన్‌ షేరింగ్, ఆర్థిక లావాదేవీలు చేయవద్దు.

రక్షించుకోవడానికి జాగ్రత్తలు 
►అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తాయి, నమ్మద్దు.
►అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తాయి.
►సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది.
►నష్టాలను తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేస్తారు.
►యాప్‌ స్టోర్‌ లేదా ప్లే స్టోర్‌లో జాబితా చేయని యాప్‌లలో పెట్టుబడుల జోలికి వెళ్లద్దు.
-ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

చదవండి: 4G To 5G: 5జీ ఫోన్లలో.. 4జీ సిమ్‌ కార్డ్‌ ఉన్న సబ్‌స్క్రైబర్‌లు.. జాగ్రత్త.. ఇలా చేస్తే
Cyber Crime: కేవైసీ అప్‌డేట్‌ చేస్తున్నారా?! పొరపాటున ఇలా చేశారో.. అం‍తే ఇక!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top