'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?

Chilli Is A Divine Medicine For Various Health Problems - Sakshi

ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర‍్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం.

  • పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్‌ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది.
  • పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్‌ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్‌ తీసుకోవడం మేలు చేస్తుంది.
  • పచ్చిమిరపలో ఉండే విటమిన్‌ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్‌ స్వింగ్స్‌ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్‌లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్‌ స్వింగ్స్‌ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు.
  • ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్‌ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా  చేర్చుకోండి.

ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top