ఈ డివైస్‌తో ఇంట్లోనే బ్రెడ్‌ తయారు చేసుకోవచ్చు

Benefits Of Automatic Bread Maker - Sakshi

ఈమధ్య.. కిరాణా లిస్ట్‌లో బ్రెడ్‌ అనేది కామన్‌  అయిపోయింది. అయితే బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకుంటేనే హెల్దీ అండ్‌  టేస్టీ అంటుంటారు చాలామంది. ఈ బ్రెడ్‌ మేకింగ్‌ మెషిన్‌ 15 ఆటోమేటిక్‌ ప్రోగ్రామ్స్‌తో యూజర్‌ ఫ్రెండ్లీగా నిలుస్తోంది. క్విక్‌ బ్రెడ్, గ్లూటెన్‌–ఫ్రీ బ్రెడ్, ఫ్రెంచ్‌ హోల్‌ వీట్‌ బ్రెడ్, జామ్‌ బ్రెడ్‌ వంటివాటిని లైట్, మీడియం, డార్క్‌ కలర్స్‌తో అందిస్తుంది. ఆటోమేటిక్‌ మిక్స్, ఇంటెలిజెంట్‌ ఫ్రూట్, నట్‌ డిస్పెన్సర్‌.. ఇలా సులభంగా పదార్థాలను కలిపి ప్రోగ్రామింగ్‌ చేస్తుంది.

టైమ్‌ సెట్టింగ్‌కి.. పిఫ్టీన్‌ అవర్స్‌ టైమర్‌తో, ట్వంటీ మినిట్స్‌ పవర్‌ ఇంటరప్షన్‌ రికవరీతో, వన్‌  అవర్‌ ఆటోమేటిక్‌ హీటింగ్‌ ఆప్షన్‌ తో ఇది రూపొందింది. నాన్‌–స్టిక్‌ పాన్, మెజరింగ్‌ కప్‌ మెషిన్‌ తో పాటు లభిస్తాయి. దీన్ని సులభంగా శుభ్రం చేయవచ్చు. డివైస్‌ మూతపైన బ్రెడ్‌ ఆప్షన్స్‌తో పాటు.. చిన్న ట్రాన్స్‌పరెంట్‌ గ్లాస్‌ ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,742).

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top