ఇన్‌స్టంట్‌ గ్లో కోసం ఇలా చేయండి.. | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టంట్‌ గ్లో కోసం ఇలా చేయండి..

Published Sat, Jul 9 2022 12:40 PM

Beauty Tips For Instant Face Glow - Sakshi

అరటిపండుని తొక్కతీసి గిన్నెలో వేసి మెత్తగా చిదుముకోవాలి. దీనిలో టీస్పూను తేనె, మూడు టేబుల్‌ స్పూన్లు బియ్యప్పిండి వేసి పేస్టులా కలపాలి. శుభ్రంగా కడిగిన ముఖంపైన ఈ పేస్టుని పూతలా వేసుకుని ఆరనివ్వాలి. పదిహేను నిమిషాల తరువాత చేతులు తడి చేసుకుని ముఖాన్ని ఐదు నిమిషాలపాటు కిందనుంచి పైకి మర్దన చేసి కడిగేయాలి.

ఈ ప్యాక్‌లోని బియ్యప్పిండి ముఖం మీద పేరుకుపోయిన జిడ్డుని తీసేస్తుంది. అరటిపండులోని విటమిన్‌ ఎ చర్మాన్ని మృదువుగా మారిస్తే, తేనె ముఖానికి తేమనందిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో ముఖానికి అందడం వల్ల ఇన్‌స్టంట్‌ గ్లోతో ముఖం మరింత కాంతిమంతంగా కనిపిస్తుంది. 

Advertisement
Advertisement