Beauty Tips: ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ఈ డివైజ్ ధర రూ. 2,830

ముడతలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు.. బాహ్యంగా సౌందర్యాన్ని, అంతర్లీనంగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. హార్మోన్ల మార్పు, మృతకణాలు చర్మరంధ్రాల్లో కూడుకుపోవడం, వయసు ప్రభావంతో గీతలు, ముడతలు పడడం.. వంటివెన్నో ఆడవారిని ఇబ్బంది పెడుతుంటాయి. చిత్రంలోని ఈ హాట్ అండ్ కూల్ స్కిన్ కేర్ టూల్.. ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెడుతుంది.
ఈ డివైజ్.. బ్లాక్ హెడ్ రిమూవర్ పోర్ వాక్యూమ్ క్లీనర్‌లా, ఎలక్ట్రిక్ ఫేషియల్ అయాన్ బ్లాక్‌హెడ్ ఎక్స్‌ట్రాక్టర్ టూల్ డివైజ్‌లా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్ హెడ్స్‌ని పోగొట్టడంతో పాటు.. జిడ్డును తగ్గిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి మృదువుగా మార్చడం, చర్మాన్ని బిగుతుగా.. ముడతలు లేకుండా చేయడం వంటి అదనపు ప్రయోజనాలనూ అందిస్తుంది.
ఈ డివైజ్‌తో పాటు లభించిన 5 మినీ హెడ్స్(చిత్రంలో గమనించవచ్చు).. 5 వేర్వేరు లాభాలను అందిస్తాయి. వాటిలో ‘లార్జ్ రౌండ్ హోల్ హెడ్’.. బ్లాక్ హెడ్స్‌ని తొలగిస్తే.. ‘స్మాల్ రౌండ్ హోల్ హెడ్’ సున్నితమైన భాగాల్లో ఉపయోగించేందుకు సహకరిస్తుంది. ‘మైక్రోక్రిస్టలైన్ హెడ్’ ముడతలను రూపమాపుతుంది. ‘మీడియం రౌండ్ హోల్ హెడ్’ మొండి బ్లాక్ హెడ్స్‌ని తొలగిస్తుంది. ‘ఓవల్ హోల్ హెడ్’ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
సున్నితమైన చర్మం, పొడి చర్మం, జిడ్డు చర్మం.. ఇలా అన్నిరకాల చర్మాలకూ ప్రొఫెష్‌నల్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఈ మినీ వాక్యూమ్ క్లీనర్. దీన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు. ఒకే ప్రదేశంలో రెండు సెకండ్ల కంటే ఎక్కువగా ఉంచరాదు. ఈ డివైజ్ లైట్‌వెయిట్‌గా ఉంటుంది కాబట్టి.. వినియోగించడం చాలా సులభం. దీని ధర 37 డాలర్లు. అంటే 2,830 రూపాయలు.
చదవండి👉🏾 Health Tips: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇవి తెలిస్తే..
Laser Comb Uses: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే!
సంబంధిత వార్తలు