యానిమల్‌ చిత్రంతో ఓవరనైట్‌ స్టార్‌ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే! | Animal Actor Triptii Dimri Wearing Fashion Brands | Sakshi
Sakshi News home page

యానిమల్‌ చిత్రంతో ఓవరనైట్‌ స్టార్‌ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే!

Jan 7 2024 4:26 PM | Updated on Jan 7 2024 4:47 PM

Animal Actor Triptii Dimri Wearing Fashion Brands - Sakshi

తృప్తి డిమ్రీ.. యానిమల్‌ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఆమె అందానికి, అభినయానికి బాలీవుడ్‌లోనే కాదు దక్షిణాది సినీ ఫ్యాన్సూ ఫిదా అయ్యారు.  ఇక ఆమె తన అందం గురించి మాట్లాడుతూ..సెల్ఫ్‌ లవ్‌తోనే అందం.. ఆనందం..నన్ను నేను ప్రేమించుకోవడం, నన్ను నేను గౌరవించుకోవడం.. నా పర్సనాలిటీలో భాగం. అవే నన్ను ఆనందంగా, అందంగా ఉంచుతున్నాయి. అందుకే, ఇతరుల నుంచి వచ్చే ప్రేమ కంటే సెల్ఫ్‌ లవ్వే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని నా నమ్మకం అంటోంది తృప్తి డిమ్రీ. ఇక ఆమెకా ఆటిట్యూడ్‌ని ఆప్ట్‌ అయ్యేలా చేస్తున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఏంటో చూద్దామా!.

సంప్రదాయ పట్టునేతకు కొత్త హంగులు అద్దుతూ సౌందర్య స్పృహకు సరికొత్త నిర్వచనంగా నిలుస్తోందీ బ్రాండ్‌. 2008లో ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టి, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. నాజూకైన డిజైన్లు.. అలరించే రంగులతో చీరలు, గార్మెంట్స్‌ను నేస్తూ ఫ్యాషన్‌కే ఓ సిగ్నేచర్‌గా మారింది ‘రా మ్యాంగో’. డిజైన్లు ఎంత యూనిక్‌గా ఉంటాయో ధరలూ అంతే! ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. తృప్తి ధరించిన చీర బ్రాండ్‌ రా మ్యాంగో ధర రూ.  79,800/-

క్యూరియో కాటేజ్‌.. 
ఇదొక మహిళల బ్రాండ్‌! ఇక్కడ పనిచేసేవారందరూ మహిళలే! ఇంకా చెప్పాలంటే మహిళల చేత మహిళల కోసం రూపుదిద్దుకున్న ప్రత్యేక బ్రాండ్‌ ఇది. అందుకే క్యూరియో కాటేజ్‌లో లభించే ఏ డిజైన్‌ను చూసినా వెంటనే ప్రేమలో పడిపోతారు. 1971లో ఏక్తా బథీజా ప్రారంభించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రస్తుతం వారి మూడోతరం వారసులు అదే ప్యాషన్‌తో కొనసాగిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.  

(చదవండి: నవ్వుతూ ఉండాలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement