Iron Deficiency Tips: ప్రతిరోజూ చక్కెర వేయకుండా గ్లాసు పళ్ల రసం... కప్పు ఆకు కూర తింటే..

Amazing 5 Health Tips For Women To Overcome Calcium Iron Deficiency - Sakshi

Top 5 Health Tips For Women: ఇంట్లో అందరికీ అన్నీ అమర్చాలి. ఈ బాధ్యత ఎప్పుడూ మహిళ మీదనే ఉంటుంది. ఆ మహిళ ఉద్యోగిని అయినా సరే ఇంట్లో వాళ్ల ఆహారం, ఆరోగ్యం అనే రెండు కీలక బాధ్యతలను కూడా తన భుజాల మీదనే మోస్తూ ఉంటుంది. ఇంటిని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకునే క్రమంలో తన జీవితంలో అనేక ప్రాధాన్యాలు వెనుకబడిపోతుంటాయి.

వాటిలో ముఖ్యమైనవి తాను తీసుకునే ఆహారం, తన ఆరోగ్యం. ఉన్నత విద్యావంతులైన మహిళలను కూడా వదలకుండా పట్టి పీడిస్తున్న సమస్యలివి. తీవ్రమైన అలసట, అంతకు మించి మానసిక ఒత్తిడి... ఈ రెండూ దేహాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. అప్పుడు పరీక్షించుకుంటే దేహంలో పోషకాలు, సూక్ష్మపోషకాలు గణనీయంగా పడిపోయి ఉంటాయి. ఈ స్థితికి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రొటీన్‌ డైట్‌ ప్లాన్‌లో వీటిని చేర్చుకోవాలి.

► ఉదయం ఒక గ్లాసు తాజా పళ్లరసం చక్కెర వేయకుండా తీసుకోవాలి. 


► మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా ఒక కప్పు ఆకుకూర ఉండాలి.


►రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఇది దేహాన్ని చల్లబరుస్తుంది. భోజనం తర్వాత ఐస్‌క్రీమ్‌ వంటి డెజర్ట్‌ తినాలనే కోరికను తగ్గిస్తుంది.


►రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగాలి. 
►ఈ మార్పు వల్ల అవసరమైన క్యాల్షియం అందుతుంది, ఐరన్, ప్రొటీన్‌ లోపం తలెత్తకుండా ఉంటుంది.

చదవండి: Legs Swelling- Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే...

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top