Ireland's Oldest Person Máirín Hughes Celebrates 109th Birthday In Dublin - Sakshi
Sakshi News home page

చేతికర్ర లేకుండా నడక, డ్యాన్స్‌ కూడా చేస్తుంది.. 109 ఏళ్ల బామ్మ హెల్త్‌ సీక్రెట్‌

Jun 19 2023 2:30 PM | Updated on Jul 14 2023 4:23 PM

109 Year Old Marine Hues Celebrates Her Birthday - Sakshi

ఫొటోలో కనిపిస్తున్న ఈమె పేరు మెరైన్‌ హ్యూస్‌. చూడ్డానికి డెభై, ఎనభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తుంది కానీ, వయసు వందేళ్ల పైనే! ఇప్పటికీ చేతికర్ర లేకుండా నడుస్తుంది. స్వయంగా వంట వండుతుంది. ఇంటి పనుల్లో ఇతరులకు సహాయం కూడా చేస్తుంది. ఇక అప్పుడప్పుడు చాలా సంతోషం వస్తే పాట పాడుతూ డాన్స్‌ ఆడుతుంది.}

రచయిత్రి అయిన ఈమె ఇప్పటికీ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తోంది. ఈ మధ్యనే అమెరికాలోని తన స్వగృహంలో కుంటుంబ సభ్యులందరితో కలసి తన 109వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో అందరినీ నవ్వుతూ పలకరించి, కేక్‌ కట్‌ చేసి, అందరికీ తానే తినిపించడంతో వారంతా ఆశ్చర్యపోయారు.

ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యం ఉండటం వెనుక అసలు రహస్యం ఏమిటని ఆమె మనవళ్లు, మనవరాళ్లు అడిగితే ‘నాకు ఏం చేయాలని అనిపిస్తే అది చేస్తా. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించను. మంచి సంగీతం వింటా. ఆహారం విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోను. కానీ, తినే ఆహారంలో నాకిష్టమైన పదార్థాలే ఎక్కువగా ఉండేలా చూసుకుంటా. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని నేను నమ్ముతా’ అని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement