హలీం.. సలాం
● రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకంగా హలీం ప్రసిద్ధి
● పుష్కలమైన పోషకాలతో తయారయ్యే ఆహారం
కొయ్యలగూడెం : రంజాన్ అంటే ముస్లింలకు పవిత్ర మాసం. ఈ మాసంలో వారు దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు. ఉపవాస దీక్షలు తీసుకున్న సమయంలో వారు నీరసించపోకుండా బలవర్థమైన ఆహారంగా హలీం ఎంతగానో దోహదపడుతుంది. మతాలకు అతీతంగా ఆహారప్రియులకు సైతం హలీం అత్యంత ఇష్టమైన వంటకంగా నిలుస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ పౌష్టికాహారం క్రమేపీ గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరిస్తోంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే అత్యంత పౌష్టికాహారాన్ని పదార్థాలలో హలీం ఒకటి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఉండటం వలన పిల్లలకు సైతం మెరుగైనదిగా వైద్యులు ధ్రువీకరిరిస్తున్నారు.
హలీం తయారీ ఇలా..
మాంసం, గోధుమలు, పప్పు దినుసులు, మసాలాలు కలిపి దాదాపు గంటసేపు ఉడికించి నీటిని అందులోనే ఇంకెలా మరిగించి.. అనంతరం దానిని గట్టి పాయసం మాదిరిగా కలిపి తయారుచేస్తారు. ఆ సమయంలోనే సరిపడా నెయ్యి, వేయించినటువంటి ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, లవంగాలు, యాలకులు మిశ్రమాలను సమపాళ్లలో కలిపి తయారు చేస్తారు. స్థోమత కలిగిన వారైతే జీడిపప్పు, బాదంపప్పు, ఇతర ఖరీదైనటువంటి డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని లేదా పౌడర్‌లను హలీం వంటలలో కలుపుకోవచ్చు.
హలీం.. సలాం
హలీం.. సలాం


