కోకోలో తెగుళ్లను తరిమికొడదాం | - | Sakshi
Sakshi News home page

కోకోలో తెగుళ్లను తరిమికొడదాం

Feb 28 2026 1:28 PM | Updated on Feb 28 2026 1:28 PM

కోకోల

కోకోలో తెగుళ్లను తరిమికొడదాం

కొలాటోట్రీకమ్‌ తెగులు సోకడంతో గోధుమ రంగులోకి మారిన కోకో కాయ , అల్లిపల్లి గ్రామంలో తెగులు సోకిన కోకో తోటలను పరిశీలిస్తున్న ఉద్యాన అధికారులు

చింతలపూడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దష్ట్యా కోకో తోటల్లో శ్రీకొలాటోట్రీకమ్‌శ్రీ తెగులు ఆశించే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపట్టాలని చింతలపూడి మండల ఉద్యాన అధికారి ఎండీ షాఫియ సూచించారు. ఈ తెగులు వల్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు క్షేత్రస్థాయిలో తోటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కోరారు.

తెగులు లక్షణాలు

కోకో ఆకులు, కాయలు లేదా పిందెలపై పసుపు రంగు వలయాలతో కూడిన చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమంగా పెరుగుతూ కాయ లేదా ఆకు అంతటా వ్యాపిస్తాయి. దీనివల్ల కాయలు నాణ్యత కోల్పోవడమే కాకుండా, చెట్టు ఎదుగుదల కూడా దెబ్బతింటుంది.

నివారణ, యాజమాన్య పద్ధతులు

తోటల్లో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా సరైన సమయంలో కత్తిరింపులు చేపట్టాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల తేమ శాతం తగ్గి తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుందని, అదే విధంగా తెగులు సోకిన ఆకులు లేదా కాయలను వెంటనే గుర్తించి, వాటిని తోట నుంచి తొలగించి దూరంగా వేసి నాశనం చేయాలని చెబుతున్నారు.

మందుల పిచికారీ

తెగులు నివారణకు ప్రతి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో హెక్సాకొనజోల్‌ 5 శాతం 2 మి.లీ. (లేదా) ప్రోపికొనజోల్‌ 0.1 శాతం 1 మి.లీ. (లేదా) కార్బండిజం + మాంకోజెబ్‌ 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. తెగులు లక్షణాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా రైతులు నిర్లక్ష్యం చేయకూడదని అధికారులు తెలిపారు. నెలకోసారి కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ (3 గ్రాములు లీటరు నీటిలో) కలిపి డ్రెంచింగ్‌ చేయడం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. కోకో సాగులో ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని ఉద్యాన అధికారిణి షాఫియ కోరారు.

ఎండీ షాఫియ, ఉద్యాన అధికారి, చింతలపూడి

కోకోలో తెగుళ్లను తరిమికొడదాం1
1/2

కోకోలో తెగుళ్లను తరిమికొడదాం

కోకోలో తెగుళ్లను తరిమికొడదాం2
2/2

కోకోలో తెగుళ్లను తరిమికొడదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement