లక్ష్యాల వైపు సాగాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాల వైపు సాగాలి

Feb 28 2026 1:28 PM | Updated on Feb 28 2026 1:28 PM

లక్ష్

లక్ష్యాల వైపు సాగాలి

లక్ష్యాల వైపు సాగాలి గంజాయి విక్రేతల అరెస్టు

తాడేపల్లిగూడెం: విద్యార్థి దశలో ఉండగానే లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటి సాధన దిశగా సాగాలని శశి ఇంజనీరింగ్‌ కళాశాల అన్వేషణలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు. అన్వేషణ టెక్నో కల్చరల్‌ ఫెస్ట్‌ కార్యక్రమం శనివారం తాడేపల్లిగూడెంలో జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న జేఎన్‌టీయు కాకినాడ వైస్‌ చాన్సలర్‌ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శశి విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలు చేరుకోవాలంటే క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. సంస్థల వైస్‌ చైర్మన్‌ మేకా నరేంద్రకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత గుర్తించడానికి ఏటా తమ కళాశాలలో అన్వేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. లలిత జ్యూయలర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎక్కడ విజయం సాధించాలన్నా కష్టపడితేనే సాధ్యమవుతుందన్నారు. సినీ నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ తాను కళాశాలలో చదువుతున్నప్పుడు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించానన్నారు. సినిమాను లక్ష్యంగా ఎన్నుకొని కష్టపడి నటుడిగా నిలబడ్డానన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్‌ బూరుగుపల్లి రాధారాణి, సెక్రటరీ, కరస్పాండెంట్‌ మేకా క్రాంతి సుధ, ప్రిన్సిపాల్‌ మొహ్మద్‌ ఇస్మాయిల్‌, కన్వీనర్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం అర్బన్‌: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ బోణం ఆది ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మాట్లాడుతూ పిఅండ్‌టి కాలనీ సమీపంలో గంజాయిని విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై నాగరాజు, సిబ్బందితో కలిసి దెందుకూరి చిదంబర్‌ వెంకట రాజు అలియాస్‌ వంశిశీ షేక్‌ అక్బర్‌ను అదుపులోనికి తీసుకొని వారి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు అరకు నుంచి కొనుగోలు చేసి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లక్ష్యాల వైపు సాగాలి  1
1/1

లక్ష్యాల వైపు సాగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement