అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు
ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
జంగారెడ్డిగూడెం: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. లక్కవరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం గ్రామానికి చెందిన కాకుళ్ల స్టాలిన్ (18), మాండ్రు సాగర్, కాకుళ్ల జస్వంత్, మానుకొండ జస్వంత్ నలుగురు స్నేహితులు. వీరంతా కలిసి ద్వారాకాతిరుమల, ఐఎస్ జగన్నాధపురం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెంలో ఒక కారును అద్దెకు తీసుకుని వారే స్వీయ డ్రైవింగ్ చేస్తూ బయలుదేరారు. కారును మాండ్రు సాగర్ నడుపుతుండగా లక్కవరం సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి కారు చెట్టును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కాకుళ్ల స్టాలిన్ కారులో నుంచి పక్కనే ఉన్నం పొలంలోకి ఎగిరిపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవింగ్ చేస్తున్న మాండ్రు సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాకుళ్ల జస్వంత్, మానుకొండ జస్వంత్‌కు స్వల్ప గాయాలు కాగా, జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకుళ్ల స్టాలిన్ పెయింట్ పనులు చేసుకుని జీవిస్తుండగా, మిగిలిన ముగ్గురు చదువుకుంటున్నారు. ఘటనపై లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు


