Sakshi Webinar: ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త..  | Sakshi Conducting Webinar For Inter Students | Sakshi
Sakshi News home page

Sakshi Webinar: ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. 

May 16 2021 3:03 AM | Updated on May 16 2021 9:18 AM

Sakshi Conducting Webinar For Inter Students

సాక్షి, ఎడ్యుకేషన్‌: పబ్లిక్‌ పరీక్షలు ముగియగానే ప్రతీ ఇంటర్‌ విద్యార్థి మదిలో మెదిలేది.. ఇం టర్‌ తర్వాత ఏమి చేయాలి? ఏ కోర్సు చేస్తే కెరీర్‌ బాగుంటుంది..? ఎలాంటి కోర్సును ఎం పిక చేసుకోవాలి? ఏఏ కోర్సు పూర్తి చేస్తే ఎలాంటి ఉద్యోగం వస్తుంది? చదువు తర్వాత ఉద్యోగం రావాలంటే ఏమి చేయాలి? ఇలాం టి ఎన్నో సందేహాలకు సరైన సమాధానాలను ఇచ్చేలా సాక్షి ఎడ్యుకేషన్‌ ఆ«ధ్వర్యంలో మే 18వ తేదీ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు వెబినార్‌ నిర్వహిస్తున్నాము. మీ సందేహాలకు ప్రముఖ సబ్జెక్ట్‌ నిపుణులు సమాధానాలు చెబుతారు. అలాగే, మీకు ఇంజనీరింగ్, లా, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా సబ్జెక్ట్‌ నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.

‘విట్‌ యూనివర్సిటీ’ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరగనుంది. https://www.arenaone.in/webinar/ లింక్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోండి. మరిన్ని వివరాలకు 040–23322330 నంబర్‌పై సంప్రదించవచ్చు. ఈ వెబినార్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్‌ చంద్ర, ఏపీ ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ ప్రత్యేక కమిషనర్‌ వి.రామకృష్ణ పాల్గొంటారు.విట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బెనర్జీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉషా శేషాద్రి విద్యార్థులకు సూచనలు–సలహాలు ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే రిజిస్ట్రేషన్‌ చేసుకోండి. మీ బంగారు భవిష్యత్‌కు సరైన బాట వేసుకోండి.      
ఆల్‌ ది బెస్ట్‌.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement