‘పది’ పరీక్షలకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు సన్నద్ధం

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

రాయవరం/కంబాలచెరువు: పదో తరగతి పరీక్షల ప్రక్రియలో తొలి అంకానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 2027 మార్చిలో జరిగే పరీక్షలకు బుధవారం నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన జిల్లాలోని ఉన్నత పాఠశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న రెగ్యులర్‌, ఫెయిల్‌ అయిన అభ్యర్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది.

అపరాధ రుసుంతో..

10వ తరగతి ఫీజు చెల్లించే అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించుకోవచ్చు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అదే తేదీ లోగా నామినల్‌ రోల్స్‌ పూర్తి చేసి ఆ తరువాత పాఠశాల లాగిన్‌ లోని లింక్‌ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకూ, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్‌ 3 నుంచి 9వ తేదీ వరకూ, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకూ చెల్లించే వీలుంటుంది.

జిల్లాలో పాఠశాలలు

జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 253 ఉన్నత పాఠశాలలు ఉండగా వాటి పరిధిలో 15,100 విద్యార్థులు విద్యాభాస్యం చేస్తున్నారు. 260 ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల పరిధిలో 15,900 మంది విద్యార్థులు చదువుతున్నట్టు అధికార వర్గాల గణాంకాలు చెబుతున్నాయి.

ఫీజు వివరాలు

ఫ పాఠశాలల్లో చదువుతున్న రెగ్యులర్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలి.

ఫ ఫెయిలైన విద్యార్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు లేదా అంతకన్నా అధికంగా ఎక్కువవారు రూ.125 చెల్లించాలి.

ఫ వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫీజుకు అదనంగా మరో రూ.60 కట్టాలి.

ఫ తక్కువ వయసున్న విద్యార్థులు (అండర్‌ ఏజ్‌ స్టూడెంట్స్‌) ఫీజుగా రూ.300 చెల్లించాలి.

ఫ చైల్డ్‌ విత్‌ స్పెషల్‌ నీడ్‌ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు. సదరం సర్టిఫికెట్‌ లేనివారు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం పంపించిన ఫార్మాట్లో సివిల్‌ సర్జన్‌ ధ్రువీకరించిన పత్రాన్ని సబ్మిట్‌ చేసే వీలును ప్రభుత్వం కల్పించింది.

ఫ రేపటి నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ

ఫ అపరాధ రుసుం లేకుండా

ఈ నెల 25 వరకు గడువు

ఫ జిల్లాలో 31 వేల మంది విద్యార్థులు

షెడ్యూల్‌ విడుదల

ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ప్రధానోపాధ్యాయులకు పది పరీక్ష ఫీజుల చెల్లింపుపై అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే చెల్లించాలి.

– కేవీ రమణారావు,

డీసీఈబీ సెక్రటరీ, తూర్పుగోదావరి

ఆన్‌లైన్‌లో చెల్లించాలి

పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. దీనికోసం బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ బీఎస్‌పీ.ఏపీ.గవ్‌.ఇన్‌ను చూడాలి. విద్యార్థుల వివరాలు, ఆధార్‌, యూ డైస్‌, అపార్‌ ఐడీ తదితర రికార్డులను సరిచూసుకుని హెచ్‌ఎంలు ఫీజు ప్రక్రియను పూర్తి చేయాలి.

– కంది వాసుదేవరావు, జిల్లా విద్యాశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement