ఏ రోడ్డులో చూసిన తవ్విన గుంతలే | - | Sakshi
Sakshi News home page

ఏ రోడ్డులో చూసిన తవ్విన గుంతలే

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలోని ఏ రోడ్డును చూసినా తవ్విన గుంతలే కనిపిస్తున్నాయని, కూటమి పాలనలో నగరంలో పరిస్థితులు అధ్వానంగా మారాయని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో నూతనంగా విలీనమైన 71వ డివిజన్‌లో సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు. భరత్‌రామ్‌ మాట్లాడుతూ 50వ డివిజన్‌కు కార్పొరేటర్‌గా, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా స్వర్గీయ గుత్తుల మురళీధర్‌ ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు. ఆయన అకాల మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి ఆయన సతీమణి గుత్తుల కోటేశ్వరి ఇప్పుడు 71 (50వ డివిజన్‌)వ డివిజన్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ తరపున కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారన్నారు. ప్రజలందరూ ఆమె ఆశీర్వదించాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్సార్‌ సీపీ పోస్టర్లు పంచి, కోటేశ్వరికి ఓటేసి గెలిపించాలని కోరారు.

విధ్వంసాన్ని జరగనివ్వం

భరత్‌రామ్‌ మాట్లాడుతూ సరైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా పైపులైన్‌, కేబుల్‌, అండర్‌ గ్రౌండ్‌ పేరుతో నగరంలో తవ్వకాలు జరుపుతూ, నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని తాము స్వాగతిస్తామని, అయితే ఆ పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా ఐదేళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి, సిటీని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానన్నారు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఇక్కడ ఎంపీ, సిటీ ఎమ్మెల్యే ఒక్క కొత్త అభివృద్ధి పనైనా చేపట్టారా అని ప్రశ్నించారు. తాను చేసిన అభివృద్ధిని, తెచ్చిన నిధులతో చేపడుతున్న పనులే తప్ప.. వారు నగరానికి చేసింది శూన్యమని విమర్శించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడగడానికి వస్తారని ప్రశ్నించారు. ఒకవైపు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెరిగిన బియ్యం, నూనె, పప్పులు, ఇతర వస్తువుల నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డివిజన్‌లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సహకారంతో మెడికల్‌ కళాశాల తెచ్చామని, అది ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుక లేకపోతే డాక్టర్‌ ప్రియాంక దారుణ హత్య బయటకు వచ్చేది కాదన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ డివిజన్‌ ఇన్‌చార్జి గుత్తుల కోటేశ్వరి, గుత్తుల మురళీధర్‌ కుమారుడు గుత్తుల హర్ష, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉన్నారు.

·˘ MýS*rÑ$ ´ëÌS-¯]lÌZ ˘

అధ్వానంగా రాజమహేంద్రవరం

·˘ {ç³×ê-ãMýS Ìôæ° AÀ-Ð]l–-¨®™ø

ప్రజలకు తప్పని పాట్లు

·˘ Ð]l*i G…ï³ ¿ýæÆý‡™Œæ Æ>ÐŒl$

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement