అనపర్తి: ఇళ్ల మధ్యలో బెల్ట్ షాపు, లూజు పెట్రోల్ విక్రయాలు చేస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఆరోపణలతో పాటు, షాపును తొలగించాలని కోరిన వారిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారంటూ బిక్కవోలు మండలం ఊలపల్లి వేలంపేటకు చెందిన మహిళలు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. అక్కడి వినాయక ఆలయం సమీపంలో కొంతకాలంగా చినబాబు అనే వ్యక్తి మ ద్యం బెల్ట్ షాపు, లూజు పెట్రోలు విక్రయిస్తు న్నాడని ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపును అక్కడి నుంచి తొలగించాలని అతడిని పలుమార్లు స్థానికులు కోరారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన దుకాణంపై దాడి చేశారంటూ వేలంపేటకు చెందిన నలుగురిపై అతడు సోమ వారం సాయంత్రం బిక్కవోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మహిళలు ఆందోళన చేసి, బెల్ట్ షాపు నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టాలని, స్థానిక మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఎస్‌ఎల్‌ఓ విధానాన్ని
వ్యతిరేకిస్తున్నాం
రాయవరం: పాఠశాల వి ద్యాశాఖ నూతనంగా ప్రవే శ పెడుతున్న స్కూల్ లెవల్ అబ్జర్వర్ (ఎస్‌ఎల్‌ఓ) విధానాన్ని యూటీఎఫ్ జిల్లా శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జిల్లా అధ్యక్షుడు ఈవీవీఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్ అ న్నారు. పసలపూడి మోడల్ ప్రైమరీ స్కూల్లో సోమవారం సాయంత్రం జిల్లాల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయ విభజనపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి మిషన్–2027లో భాగంగా ప్రవేశ పెట్టిన ఎస్‌ఎల్‌ఓ వ్యవస్థ విద్యార్థులకు మేలు చేయక పోగా నష్టం చేకూర్చుతుందన్నారు. ఉపాధ్యాయులను దూర మండలాల పాఠశాలలకు కేటాయించడం ద్వారా బోధనకు ఆటంకం కలిగే పరిస్థితులు తలెత్తుతాయన్నారు. .
నేటి నుంచి కౌశల్ పరీక్షలు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు కౌశల్ 2026 స్కూల్ లెవెల్ ఆన్‌లైన్ పరీక్ష రాసే అవకాశం కల్పించినట్లు కౌశల్ స్టేట్ కో ఆర్డినేటర్ మేకా సుసత్య రేఖ తెలిపారు. ఈ నెల 10న 8వ తరగతి విద్యార్థులకు, 11న 9వ తరగతి, 12న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు పాఠశాల స్థాయిలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల మధ్య విద్యార్థులు తమ తమ పాఠశాలల్లోనే ఆన్‌లైన్‌లో 60 నిమిషాల పాటు పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. హాల్ టిక్కెట్ నంబర్లను పాఠశాల డైస్ కోడ్ ఆధారంగా కేటాయించాలని, కౌశల్‌ఎగ్జామ్.బీవీఎమ్‌ఏపీ.ఆర్గ్/స్టూడెంట్–ఎగ్జామ్ అనే లింక్‌తో లాగిన్ పాస్‌వర్డ్‌గా కౌశల్ 2026 నమోదు చేయాలన్నారు. వివరాలకు 94408 54489 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


