అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, అభ్యర్థుల ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు.. ఇలా ప్రతి దశను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందస్తు శిక్షణ ఇవ్వాలని, పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు, భద్రతా ఏర్పాట్లలో లోటుపాట్లకు తావులేకుండా చూడాలని తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారుల మధ్య సమన్వయం కీలకమని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement