21న చినవెంకన్న తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

21న చినవెంకన్న తెప్పోత్సవం

Nov 7 2026 12:18 AM | Updated on Nov 7 2026 12:18 AM

● ముస్తాబవుతున్న నృసింహ సాగరం

● క్షీరాబ్ధి ద్వాదశి వేడుకలకు ఏర్పాట్లు

ద్వారకాతిరుమల: జల విహారానికి చినవెంకన్న సిద్ధమవుతున్నారు. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ రాత్రి స్వామివారి తెప్పోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీవారి పుష్కరణి (నృసింహ సాగరం)లోని తెప్పకు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. గట్లపై పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో విద్యుద్దీపాలంకరణ పనులు ప్రారంభించనున్నారు.

తొళక్క వాహనంపై ఊరేగింపుగా

ఉత్సవం జరిగే రోజు రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలసి తొళక్క వాహనంపై ఊరేగి, 8 గంటల సమయంలో పుష్కరణికి చేరుకుని విహరించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఈఓ వేండ్ర త్రినాథరావు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement