ఎస్కలేటర్‌ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎస్కలేటర్‌ పనుల పరిశీలన

Nov 6 2026 12:09 AM | Updated on Nov 6 2026 12:09 AM

తుని రూరల్‌: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్న ఎస్కలేటర్‌ పనులను దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ పరిశీలించారు. గురువారం లోవ దేవస్థానానికి వచ్చిన ఆయన పనులు పరిశీలించి, వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ కమీషనర్‌ పి.విశ్వనాథరాజును ఆదేశించారు. అన్నవరం దేవస్థానం ఈఓ సూర్యచక్రధరరావు, సహాయ ఇంజినీర్‌ ఎస్‌వీ రమణ పాల్గొన్నారు.

విద్యుదాఘాతానికి

మహిళ మృతి

అయినవిల్లి: మండలంలోని శానపల్లిలంక గ్రామంలో విద్యుదాఘాతానికి ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు, ఆమె కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శానపల్లిలంకకు చెందిన కొరుపల్లి శ్రవంతి (35) తన ఇంటి ఆవరణలో తీగపై బట్టలు ఆరబెడుతుండగా విద్యుత్‌ సర్వీస్‌ వైరు తగిలింది. దీంతో ఆమె విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త సతీష్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement