ద్వారకాతిరుమల: చిన వెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో ఏలూరు జిల్లా దేవదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, పలువురు దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు, పోలీసుల పర్యవేక్షణలో లెక్కించారు. గడచిన 27 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ.2,52,47,879 వచ్చినట్టు ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే 127 గ్రాముల బంగారం, 3.466 కేజీల వెండి, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. వీటితో పాటు రద్దయిన పాత రూ.2 వేలు, రూ.1000, రూ.500 నోట్ల రూపంలో మరో రూ.8,500 వచ్చిందన్నారు. హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకు శ్రీవారికి రూ.9,35,107 వచ్చినట్టు ఈఓ తెలిపారు.


