ఆత్రేయపురం: వాడపల్లి క్షేత్రంలో కొలువైన వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 6వ రోజు మంగళవారం ప్రత్యేక పూజలు, స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. స్వామివారిని ఉదయం శ్రీకృష్ణ అలంకరణలో సూర్యప్రభ వాహనంపై, రాత్రి మోహిని అలంకరణలో చంద్రప్రభ వాహ నంపై అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పా ల్గొని స్వామివారికి పువ్వులు, పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, ఆలయ కమిటీ సభ్యుడు శిష్టా సూ ర్య కుటుంబరావు, అర్చకుడు వాడపల్లి సుందర శేషావతారం పర్యవేక్షణలో పూజలు, సేవలు జరిపారు.
ఫ వైభవంగా వాడపల్లి వెంకన్న
బ్రహ్మోత్సవాలు
ఫ సూర్యప్రభ, చంద్రప్రభ
వాహనాలపై ఊరేగింపు
ఫ భారీగా తరలివచ్చిన భక్తులు


