అనపర్తి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గంజాయి సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, దీనికి విద్యార్థులతో సహా అనేక మంది యువకులు బానిసలై ఘోరాలకు పాల్పడుతున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం అనపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి బ్యాచ్‌లను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు వెంట వేసుకుని తిరుగుతూ నీతి వ్యాఖ్యలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గంజాయి బ్యాచ్‌లను ఆ తండ్రీకొడుకులే ప్రోత్సహిస్తున్నారని అన్నారు. యువతను గంజాయికి బానిసలుగా మార్చి, వారిని తమ రాజకీయ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల నిరుపేద తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవిస్తున్నారో ఎమ్మెల్యేకు అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. ఇటీవల అనపర్తిలో భారీగా గంజాయితో పట్టుబడిన వ్యక్తి ఎమ్మెల్యేకు, ఆయన కుమారుడికి ముఖ్య అనుచరుడని, అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తుంటే, టీడీపీ నాయకులు విడుదల చేయించారో లేదో కాల్ డేటా బయటకు తీయాలన్నారు. గంజాయి విక్రేతలకు, తాగేవారికి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ నేరాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నాయకులు, మైకుల ముందుకొచ్చి శ్రీరంగ నీతులు చెబితే ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా రాజకీయాలకు అతీతంగా గంజాయి మూలాలపై ఉక్కుపాదం మోపేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని, అంతేతప్ప ఒకవైపు గంజాయి బ్యాచ్‌లకు కొమ్ముకాస్తూ మరోవైపు నీతులు చెప్పడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఫ బ్యాచ్‌లను పెంచి పోషిస్తోంది
తండ్రీకొడుకులే
ఫ మాజీ ఎమ్మెల్యే
డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ధ్వజం


