నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 14, 17 ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సోమవారం ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. వీటిని ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి, పీడీ పి.శ్రీనివాస్ ప్రారంభించారు. అండర్–14, 17 బాల బాలికల జిమ్నాస్టిక్స్, అండర్–14, 17, 19 స్వ్కాష్, అండర్–14, 17 బాల బాలికల సపక్ తక్రా, అండర్–17 బాలికల బ్యాడ్మింటన్‌లో ఎంపికలు జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 500 మంది హాజరు కాగా, వీరి నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. ఎస్‌జీఎఫ్‌ఐ అడ్మిన్ కార్యదర్శి శేషుకుమారి, డీఎస్‌ఏ కోచ్‌లు చిన్నారి, సురేష్, లక్ష్మణ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి మాచరరావు, ట్రజరర్ నాగలింగేశ్వరరావు పాల్గొన్నారు.


