అమలాపురం రూరల్: విదేశాలకు ఉపాధి కోసం వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న ఇద్దరు మహిళలను మెగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఐ.భీమవరానికి చెందిన తాటిపాక హవీల, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కోలుకుల నిర్మల కుమారి రెండేళ్ల క్రితం ఖతార్‌కు వెళ్లారు. సమయం పూర్తయినా వారిని స్వదేశానికి పంపకుండా ఇబ్బందులకు గురి చేస్తుండడంతో కుటుంబ సభ్యులు స్థానిక మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఆశ్రయించారు. దీంతో ఆ ఇద్దరినీ సురక్షితంగా ఇంటికి రప్పించారు.


