02కెకెడి172:
ఫ తుపాను బాధితులకు ఏఎంజీ
పాఠశాలలో ఆశ్రయం
ఫ స్కూల్లో మాయమైన పరికరాలు
బాలాజీచెరువు(కాకినాడ): డెయిరీ ఫామ్ సెంటర్‌లోని ఏఎంజీ స్కూల్ పాఠశాలలోని పరికరాలతో పాటు విలువైన ఎల్‌సీడీ ప్రాజెక్టర్ అపహరణకు గురవ్వడంతో పాఠశాల ప్రిన్సిపాల్ సబ్బవరపు చందన సోమవారం ఆవేదనతో విడుదల చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సంభవించిన అర్నబ్ తుపాను నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొందరు బాధితులకు పాఠశాల ఆవరణలో వసతి కల్పించారు. ఆ సమయంలో కొందరు పాఠశాల తరగతి గదుల తాళాలు పగలకొట్టి రికార్డులు, పుస్తకాలు చింపివేయడంతో పాటు సైన్స్ ల్యాబ్ పరికరాలు ధ్వంసం చేశారు. ధర్మాకోల్ షీట్లతో విద్యార్థులు తయారు చేసిన సీవీ రామన్, అబ్దుల్ కలామ్ ఆకృతులు చిందర వందరగా పడేశారు. సీసీ కెమెరాలు, ఆర్‌వో ప్లాంట్ ట్యాంక్, పాఠశాల ఎలక్ట్రికల్ వైరింగ్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. తుపాను సమయంలో ఆశ్రయమిస్తే, ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రిన్నిపాల్ ప్రశ్నించారు. చోరీ చేసిన ప్రాజెక్టులు, పరికరాలు తిరిగి ఇవ్వాలని కోరారు.
ధ్వంసమైన సీవీ రామన్ ఆకృతి


