రాయవరం: ప్రయాణికులతో వస్తున్న ఆటోను పాల లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్, ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని చెల్లూరులో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెల్లూరుకు చెందిన పైడికొండల వీరవెంకట సత్యనారాయణ తన ఆటోలో అదే గ్రామానికి చెందిన మహిళలను మండపేట మండలం ఇప్పనపాడులో ఫంక్షన్‌కు తీసుకువెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ మలుపు వద్ద ఆటోను కె.గంగవరం మండలం పామర్రు నుంచి అనకాపల్లి వెళుతున్న పాల లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణ, ఆటోలో ప్రయాణిస్తున్న చోడే దుర్గాలక్ష్మి, నురుకుర్తి వీరవేణి, గుబ్బల శ్రీదేవి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం రామచంద్రపురం ఏరియాకు తరలించారు. రాయవరం ఎస్సై సురేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.


