నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అశ్మిత సౌత్ జోన్ జూనియర్, సబ్ జూనియర్ మహిళా హాకీ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హాకీ ఇండియా సహకారంతో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం సబ్ జూనియర్స్ విభాగంలో ఫ్రెండ్స్ హాకీ క్లబ్‌పై కేరళ జట్టు 30–0 స్కోర్‌తో, జూనియర్స్ విభాగంలో నైట్ రైడర్స్‌పై కేరళ హాకీ జట్టు 6–0 స్కోర్‌తో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లను కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు కె.రవిచంద్ర, టోర్నమెంట్ నిర్వహణ కమిటీ కార్యదర్శి రజని, ఉపాధ్యక్షురాలు సుధారాణి, సభ్యులు దీప్తి ఎస్తేర్, సూరిబాబు, హరిబాబు పర్యవేక్షించారు. సుధారాణి మాట్లాడుతూ వుమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా బాలికలను క్రీడల్లో ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు.


