ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రాంతీయ కార్యాలయానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది. 2025–26 సంవత్సరానికి గాను దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రాంతీయ కార్యాలయంగా ఎంపికై ంది. ప్రజలకు అందించే సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలు, సమర్థవంతమైన పరిపాలన, విధులపై నిబద్ధత, విశిష్ట పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డు లభిందించి. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ చేతుల మీదుగా ఈపీఎఫ్‌వో ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్–2 కలువాయి వెంకటేశ్వర్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు కేవలం గతంలో సాధించిన విజయాలకు గుర్తింపు మాత్రమే కాదని, భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యతను గుర్తుచేసే ప్రేరణ అన్నారు.


