ఇల వైకుంఠమే.. కనుల వైభోగమే | - | Sakshi
Sakshi News home page

ఇల వైకుంఠమే.. కనుల వైభోగమే

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

● అశేషంగా తరలివచ్చిన భక్తులు

ఆత్రేయపురం: ఇల వైకంఠమైంది.. ఆ వేంకటేశ్వరుని చూసిన ప్రతి మది మురిసింది.. బ్రహోత్సవాల వేళ కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో ఆధ్యాత్మిక కోలహలం నెలకొంది.. బ్రహోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సహజ సిద్ధమైన పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగు రంగుల విద్యుత్‌ దీపాల కాంతులతో వైకుంఠంగా తీర్చిదిద్దారు. రాత్రి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను యోగ నారసింహ అలంకరణతో సింహ వాహనంపై మేళతాళాల మధ్య మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవ పూజలు, శ్రీనివాస కల్యాణం తదితర కార్యక్రమాల్లో దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, ఆలయ కమిటీ సభ్యుడు శిష్టా సూర్య కుటుంబరావు, అర్చకుడు వాడపల్లి సుందర శేషావతారం పర్యవేక్షణలో వివిధ పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకలను వీక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, సేవా కార్యకర్తలు పాల్గొని భక్తులకు సౌకర్యాలు కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement