నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో అశ్మిత సౌత్‌జోన్ మహిళా హాకీ పోటీలు ఆదివారం ఉత్కంఠగా జరిగాయి. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాకీ ఇండియా సహకారంతో జరుగుతున్న ఈ పోటీలను ఎమ్మెల్సీ, టోర్నమెంట్ చీఫ్ ప్యాట్రన్ కర్రి పద్మశ్రీ ప్రారంభించారు. కేరళ జట్టుపై 5–2 స్కోర్‌తో విజయం సాధించి సెమీస్‌కు చేరిన కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జట్టును ఆమె అభినందించారు. వాడపాటి టీంపై నైట్‌రైడర్స్ జట్టు 5–1తో, అనంతపురం స్పోర్ట్స్ క్లబ్ జట్టు ఫ్రెండ్స్ హాకీ క్లబ్‌పై 20–0 స్కోర్‌తో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లను కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు రవిచంద్ర ప్రసాద్, క్లబ్ అధ్యక్షుడు బాబ్జి, రమేష్, విజయ్, అవినాష్, సూరిబాబు, టోర్నమెంట్ కమిటీ సభ్యులు రజని, సుధారాణి, దీప్తి ఎస్తేర్, సురేష్‌రాజు, హరిబాబు తదితరులు తిలకించారు.


