గోదావరి తీరంలో గజ్జెల సవ్వడి | - | Sakshi
Sakshi News home page

గోదావరి తీరంలో గజ్జెల సవ్వడి

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని సరస్వతీ ఘాట్‌లో శనివారం సాయంత్రం కృష్ణా పుష్కర మహాకుంభ శాసీ్త్రయ నృత్య వైభవం జరిగింది. ధర్మో రక్షిత రక్షితఃట్రస్టు, సేవ్‌ హిందూ టెంపుల్స్‌, శ్రీరాధాకృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 80 మంది నృత్య కళాకారిణులు పోటీ పడగా, వీరిలో ఎనిమిది మందిని ఎంపిక చేశారు. 2028లో జరిగే కృష్ణా పుష్కరాల కోసం ఈ నృత్య వైభవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, అంతర్జాతీయంగా కొందరిని ఎంపిక చేస్తారు. వారందరికీ కృష్ణా పుష్కరాల సమయంలో గుంటూరు తాళ్లాయపాలెంలోని శ్రీశైవక్షేత్రంలో పోటీలు నిర్వహిస్తారు. విజేతలైన 12 మందికి బంగారం, వెండి, రజత కిరీటాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా శైవక్షేత్ర పీఠాధిపతలు శివస్వామి, గజల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సనాతన సంప్రదాయ నృత్యాలకు పూర్వ వైభవం తీసుకుని వచ్చేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నిర్వాహకుడు డాక్టర్‌ జీబీ నారాయణ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సమయంలో మహా బృంద నాట్య నివేదన పేరుతో 12 వేల మంది కళాకారులతో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం నృత్య నీరాజనం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement