రంపచోడవరం: ఎస్జీఎఫ్ఐ గేమ్స్ రాష్ట్ర స్థాయి అండర్ – 14 బాలుర ఫుట్బాల్ పోటీలను శనివారం రంపచోడవరంలో నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయస్థాయికి ఎంపిక చేశారు.
అర్నబ్ తుపానులో వ్యక్తి మృతి
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): అర్నబ్ తుపానులో వ్యక్తి మృతి చెందిన సంఽఘటన రాజమహేంద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. క్వారీ గోతుల్లో శనివారం అతడి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. అతడిని సుబ్బారావుపేటకు చెందిన గారా శ్రీనుబాబు (56)గా గుర్తించారు. శ్రీనుబాబు గత నెల 28న తుపాను సమయంలో క్వారీ ప్రాంతంలో బహిర్భూమికి వెళుతున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. శ్రీనుబాబు బహిర్భుమికి వెళుతూ కాలుజారి క్వారీ గోతుల్లో పడిపోయి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. మూడో పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


