ఎన్నికల వేళ ఏం చెప్పారంటే...
బలహీనవర్గాల ప్రజలందరినీ రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తాం. అందుకోసం 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీల రక్షణ చట్టం తీసుకొస్తాం.
తర్వాత ఏం చేశారంటే...
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయినా బీసీ రక్షణ చట్టం తీసుకురాలేదు. 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టమూ చేయలేదు. వాస్తవానికి కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండడంతోపాటు బీజేపీకి టీడీపీ ఎంపీల మద్దతు ఎంతో అవసరం. ఇలాంటి తరుణంలో కేంద్రం మెడలు వంచి చట్టం చేయించడం చాలా సులువు. అయినప్పటికీ చంద్రబాబు అండ్ కో అలా చేయకుండా బీసీలను మోసం చేసేందుకు రెండు జీఓలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. న్యాయ పరీక్షలో ఆ జీఓలు నిలవవు అని తెలిసినా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అందరూ ఊహించినట్లుగానే ఆ జీఓలను హైకోర్టు.. తర్వాత సుప్రీంకోర్టు కొట్టేయడంతో చంద్రబాబు చేసిన ద్రోహంపై బీసీలంతా భగ్గుమంటున్నారు.


