కపిలేశ్వరపురం (మండపేట): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా మండపేట మండలం అర్తమూరుకు చెందిన గొలుగూరి సందీప్‌రెడ్డిని నియమించారు. ఆ మేరకు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం శుక్రవారం నియామక ప్రకటన విడుదల చేసింది. తనకు తగిన ప్రాధాన్యం కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు సందీప్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యువజన సమస్యలను అధ్యయనం చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.


