కోరుకొండ/ సీతానగరం: కాలువలో గల్లంతైన ఏఎన్ఎం మృతి చెందింది. సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి నాగంపల్లి సచివాలయ ఏఎన్ఎంగా దేవీపట్నం మండలం ఇందుకూరుకు చెందిన కారం సత్యవతి(48) పని చేస్తోంది. ఈ నెల 28న నాగంపల్లిలో విధులు నిర్వహించిన అనంతరం భర్తతో కలసి స్వగ్రామం వెళ్లే సమయంలో కోరుకొండ మండలం కోటికేశవరం దగ్గరలో ఉన్న ఈనుకొండ కాలువ దాటుతుండగా ప్రమాదవశాత్తు ఏఎన్ఎం సత్యవతి గల్లంతైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు నల్లచెరువు సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన ఇందుకూరిపేటకు ఆమె మృతదేహాన్ని తరలించామని సీతానగరం పీహెచ్సీ వైద్యురాలు వి.భవాని తెలిపారు.
వ్యాన్ బోల్తా
ముగ్గురికి గాయాలు
దేవరపల్లి: నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద కూలీలతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడిన సంఘనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన శీలం వీర్రాజు, శీలం వెంకటేశ్వరరావు, శీలం ప్రసాద్‌లు శుక్రవారం నల్లజర్ల మండం దూబచర్లకు పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వ్యాన్‌పై పొంగుటూరు వస్తుండగా, వ్యాన్ టైర్ ఫంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురికీ తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


