18 గంటలు ఆలస్యంగా నడిచిన రైళ్లు | - | Sakshi
Sakshi News home page

18 గంటలు ఆలస్యంగా నడిచిన రైళ్లు

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

రాజమహేంద్రవరం సిటీ: తుపాను ప్రభావంతో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు గురువారం 15 నుంచి 18 గంటలకు పైగా ఆలస్యంగా నడిచాయి. వీటిలో ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం సమయంలో చేరుకోవాల్సిన పలు రైళ్లు రాత్రి అయినా రాకపోవడంతో ప్లాట్‌ఫాంలపై ఎదురు తెన్నులు చూశారు. రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొనడంతో ప్రయాణికుల సౌకర్యార్థం 75693 05679 హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం స్టేషన్‌ చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ సుంకర చంద్రమౌళి తెలిపారు.

నేడు పలు రైళ్లు రద్దు : వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తూ రైల్వే అధికారులు పర్యటించారు. 29వ తేదీన ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌ హౌరా (12840), ఖరగపూర్‌ –విల్లుపురం (22603), షాలిమార్‌ – యశ్వంతపూర్‌ (18063), భువనేశ్వర్‌ – న్యూసీఎస్టీ ముంబై (11020) రైళ్లను గురువారం రద్దు చేయడంతో శుక్రవారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు రావు. అలాగే 30, 31 తేదీల్లో షాలిమార్‌ – చర్లపల్లి (18045), చర్లపల్లి – షాలిమార్‌ (18046) రైళ్లు రద్దయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement