బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

● వాడపల్లిలో వైభవంగా ప్రారంభం ● భారీగా తరలివచ్చిన భక్తులు

ఆత్రేయపురం: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలతో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి భక్తజన సంద్రమైంది. అశేష భక్త జనవాహిన నడుమ గురువారం అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. రాత్రి కన్నుల పండువగా శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి ఉత్సవమూర్తులను శేష వాహనంపై మాడ వీధులలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజా కార్యక్రమాల్లో దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు, ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు దంపతులు పాల్గొన్నారు. టీటీడీ వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు, వేద పండితుల బృందం సభ్యులు పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, సేవా కార్యకర్తలు పాల్గొని భక్తుల వసతుల కల్పనకు సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement