వెన్ను విరిగిన అన్నదాత | - | Sakshi
Sakshi News home page

వెన్ను విరిగిన అన్నదాత

Oct 29 2026 3:29 PM | Updated on Oct 29 2026 3:29 PM

చంద్రబాబు ప్రభుత్వం పరిహారమిచ్చేనా?

గతంలో మోంథా తుపాను సమయంలోనూ, గత నెలలో అకాల వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడూ చంద్రబాబు ప్రభుత్వం తమను ఆదుకోలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో సుమారు 2 వేల హెక్టార్లలో వరి నీటమునిగింది. మరో 2 వేల హెక్టార్లలో కూరగాయల పంటలు పాడయ్యాయి. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదు. గత నష్టాలకే పరిహారం అందలేదని, ఇప్పుడు అర్నాబ్‌ తుపాను కారణంగా జరిగిన నష్టానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పారదర్శకంగా అంచనా వేయాలని కోరుతున్నారు. అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించడంతోపాటు, పంట పెట్టుబడులు, అప్పుల భారంతో సతమతమవుతున్న తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సాక్షి, రాజమహేంద్రవరం : అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొస్తుందన్న ఆశతో ఎదురుచూసిన అన్నదాతకు అర్నబ్‌ తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వేసవిని తలపించే ఎండలు, కరువు పరిస్థితులను తట్టుకుని సాగు చేసిన వరి పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో బలమైన ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. భారీ వర్షాలకు తోడు గాలుల తీవ్రతకు వేలాది ఎకరాల్లో వరి నేలవాలింది. అరటి తోటలు సైతం కుప్పకూలాయి. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి ప్రకోపంతో తమ శ్రమంతా నేలపాలైందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అర్నాబ్‌ తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బలమైన ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి.

ప్రతికూల పరిస్థితుల్లోనూ ఖరీఫ్‌ సాగు

జిల్లాలో సుమారు 92 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వాస్తవానికి ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోయాయి. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలు కూడా వేసవిని తలపించాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు భానుడి సెగలతో వాతావరణం వరిసాగుకు ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ అన్నదాతలు పట్టువిడవకుండా వరి పంటను ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చారు. వర్షాలు కురవకపోయినా, చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించకపోయినా, ప్రకృతి సహకరించకపోయినా వరిని మాత్రం కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలో ఇప్పటికీ జిల్లాలో సుమారు పది వేల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 80 వేలకు పైగా హెక్టార్లలోని పంట అంతా రానున్న పదిహేను రోజుల్లో కోతలు పూర్తి చేసి ధాన్యం విక్రయించేందుకు చాలా కీలకం. ఇటువంటి తరుణంలో అర్నాబ్‌ అన్నదాతల ఆశలపై విరుచుకుపడింది.

కోలుకోలేని దెబ్బ

జిల్లాలోని ఏ ప్రాంతంలో చూసినా భారీ గాలుల తీవ్రతను వరి చేను నేలవాలిపోయింది. ఇప్పటికే సాగు ఖర్చులు పెరగడం, ఎండల ప్రభావం, నీటి సమస్యలు వంటి ఇబ్బందులను అధిగమించి రైతులు వరి పంటను సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో బలమైన గాలులు వీయడంతో పొలాల్లో వరి నేలవాలింది. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేల వాలిన వరి గింజలు తడిసిపోవడం, కోతలు ఆలస్యమయ్యే పరిస్థితులు తమను కలవరపెడుతున్నాయని వాపోతున్నారు. పంట నష్టంతో దిగుబడి తగ్గడమే కాకుండా, కోతలు, నూర్పిడి ఖర్చులు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నా.. చివరి దశలో తుపాను తమ ఆశలపై నీళ్లు చల్లిందని అన్నదాతలు వాపోతున్నారు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు గాలుల తీవ్రతకు అరటి తోటలు కూడా నేలకూలాయి. చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఎక్కువ శాతం పంట నీట మునిగిపోవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

దేవరపల్లి: పల్లంట్లలో ఈదురు గాలులకు

ఒరిగిన బొప్పాయి తోట

దేవరపల్లి: పల్లంట్లలో ధ్వంసమైన అరటి తోట

ఫ తీవ్ర ఎండలు,

వర్షాభావాన్ని తట్టుకుని సాగు

ఫ ఆరుగాలం శ్రమించి

వరిని కాపాడిన రైతులు

ఫ ఈదురుగాలులు,

భారీ వర్షాలతో నేలకొరిగిన పంట

ఫ సుమారు 10 వేలకు పైగా

ఎకరాల్లో నేలవాలిన వరి

ఫ పంట ఇంటికొచ్చే వేళ

అన్నదాతలకు తీవ్ర నష్టం

ఫ గత నష్టాలకే

పరిహారం అందించని చంద్రబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement