రాయవరం: మండలంలోని మాచవరంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన జొన్నకూటి నానిబాబు, నూతిక పెద్ద, బొమ్ము చిన్న, పువ్వల ప్రసాద్, నూతిక బన్నీ, కట్టమూరు వంశీ, యార్లగడ్డ చిన్న, అర్తమూరు గోపి, బుంగ పెదసత్తిబాబు, పిల్లి చిన్న, వీధి మదన్‌బాబు, పలివెల సునీల్, సీహెచ్.వినోద్, కొల్లి భానుచంద్ర, పేలూరి సత్యనారాయణ, యడ్ల అన్నవరం, గొల్లపల్లి అప్పారావు తదితరులు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు తోడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి నాయకత్వంపై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పార్టీ తరపున ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న మేడపాటి చంద్రశేఖరరెడ్డి, అముజూరి దుర్గాభవాని విజయానికి తాము కృషి చేస్తామ న్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు మల్లిడి రామారెడ్డి, వెలగల అచ్యుత రామారెడ్డి, వెలగల త్రినాథరెడ్డి, తమలంపూడి సత్యనారాయణరెడ్డి, మల్లిడి భామిరెడ్డి, కొవ్వూరి అమ్మిరెడ్డి, నీలం తాతాజీ, బేతా బుల్లి, పలివెల శ్రీను, కత్తుల బాబీ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నుంచి 30 మంది చేరిక
ీసతానగరం: మండలంలోని చినకొండేపూడి గ్రామంలో టీడీపీకి చెందిన సుమారు 35 మంది కార్యకర్తలు ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం మాజీ రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ వైస్ ఎంపీపీ ముదునూరి సురేష్ రాజు నివాసంలో బుధవారం టీడీపీకి చెందిన మట్ట రాజు, మట్ట సురేష్, మాగంటి అంజిబాబు, అంజరపు సూరమ్మ, మాగంటి దుర్గాప్రసాద్, మాగంటి సాయితో పాటుగా 30 మందికి జక్కంపూడి గణేష్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వా రు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి పాటు పడుతూ స్థానిక ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. అనంతరం చినకొండేపూడి, చీపురుపల్లి ఎంపీటీసీ అభ్యర్థులు, జెడ్పీటీసీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబుతో కలిసి జక్కంపూడి గణేష్ ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గంటా శ్రీనివాస్, నాయకులు పెందుర్తి దాసు, ముదునూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం: చినకొండేపూడిలో గణేష్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకులు
రాయవరం: మాచవరంలో వైఎస్సార్ సీపీలో చేరిన వారిని ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు
ఫ మాచవరంలో పార్టీ కండువా కప్పి
ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు
ఫ చినకొండేపూడిలో
జక్కంపూడి గణేష్ సమక్షంలో చేరిక


