కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 42 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి ఎస్పీ డి.నరసింహకిషోర్‌కు సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత స్టేషన్ల పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సత్వరమే న్యాయం చేయాలని ఉత్వర్వులు ఇచ్చారు. ఈ అర్జీల్లో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట కేసులు ఉన్నాయి.
ప్రభుత్వాసుపత్రి
సూపరింటెండెంట్‌గా సోఫియా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ సోఫియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన కేఏవీ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆ బాధ్యతలను డాక్టర్ సోఫియాకు అప్పగిస్తూ డీఎంఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె ప్రభుత్వ వైద్య కళాశాలలో అనస్తీషియా విభాగంలో హెచ్‌ఓడీగా విధులు నిర్వస్తున్నారు.
సిబ్బంది అందుబాటులో
ఉండాల్సిందే..
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించేందుకు ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు సంబంధిత సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సిబ్బంది హాజరు, ప్రజలకు అందుబాటులో ఉన్న తీరును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 164 అర్జీలు స్వీకరించామన్నారు. సహాయ కలెక్టర్ కె.ఆదిత్యశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్‌రెడ్డి, డీఎస్పీ ఎ.శివప్రియ, డీడీఓ కె.రత్నకుమారి, సీపీఓ ఎల్.అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.


