నిడదవోలు రూరల్: రాఖీ పండగ రోజు సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన ఓ వివాహిత అదృశ్యమైంది. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తొట్టా వీర వెంకట సత్యనారాయణ, భార్య భారతీ ఏసురాణి (24) ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం బైక్‌పై మునిపల్లి గ్రామానికి వచ్చారు. భారతీ రాణి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు అక్క ఇంటి దగ్గర ఉండిపోయింది. సత్యనారాయణ ఆమెను అక్కడ దించి తిరిగి బ్రాహ్మణగూడెం వెళ్లిపోయాడు. అయితే భర్త వదిలి వెళ్లినప్పటి నుంచి భార్య భారతీ ఏసురాణి ఆచూకీ లభించలేదు. సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టూరిస్ట్ బస్సు ఢీకొని
ల్యాబ్ టెక్నీషియన్ మృతి
కరప: పెనుగుదురులోని ఓ రెస్టారెంట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి మృతి చెందాడు. కరప ఎస్సై తోట సునీత తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ వెంకటనగర్‌కు చెందిన యాళ్ల శేఖర్ కె.గంగవరం మండలం కుందూరు పీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి బిర్యానీ తినేందుకు ఆదివారం పెనుగుదురులోని డాబా రెస్టారెంట్‌కు వెళ్లాడు. తిరిగి వస్తూ మోటార్ సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా కాకినాడ నుంచి సిరిపురం వెళుతున్న టూరిస్ట్ బస్ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెచ్‌సీ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శేఖర్ మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృడినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


