ఇంతింతై నభోవీధిపైనంతై..! | - | Sakshi
Sakshi News home page

ఇంతింతై నభోవీధిపైనంతై..!

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

ఆత్రేయపురం: ఏ స్వామిని దర్శిస్తే ఆపదలు దూరమవుతాయో.. ఏడు శనివారాలు.. ఏడు ప్రదక్షిణల వ్రతం ఆచరిస్తే ఏ స్వామి కరుణించి కష్టాలు కడదేరుస్తాడో ఆయనే వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి. కొన్నేళ్ల క్రితం వరకు అంతగా అలికిడి లేని ఈ గ్రామంలో నేడు అంతటా గోవింద నామమే మార్మోగుతోందంటే అతిశయోక్తి కాదు. శనివారం వస్తే ఇసుకేస్తే రాలనంతగా భక్తజన సందోహం.

ఆయన ‘లక్ష్మీ’పతి

ఈ ఏడాది వివిధ మార్గాల ద్వారా సుమారు 70 కోట్ల ఆదాయం ఆలయానికి సమకూరింది. అలాగే సుమారు 90 లక్షల నుంచి కోటి మంది ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 25 లక్షల మందికి పైగా ఉచిత అన్నదానాన్ని స్వీకరించారు. కేవలం అన్నదానానికే సుమారు రూ.14.52 కోట్ల విరాళాలు అందాయి. హుండీల ద్వారా రూ.15.71 కోట్లు, వివిధ బ్యాంకులలో రూ.30 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 1700 సంవత్సర కాలంలో నాటి పెద్దాపురం మహారాజు తిమ్మ జగపతిరాజు స్వామి వారికి 412 ఎకరాల సుక్షేత్రాన్ని అందజేశారు. 26 ఎకరాల భూమిని ఆలయ అర్చకులు, ఇతరసేవ నిమిత్తం కేటాయించారు. 70 ఎకరాల లీజు ద్వారాఐ ఏటా సుమారు రూ.55 లక్షల ఆదాయం లభిస్తోంది. సుమారు 13 ఎకరాల్లో ఆలయం దుకాణాలు, పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. అలాగే 5.85 ఎకరాలు సీసీఎల్‌ఆర్‌ కోర్టు వాజ్యం ద్వారా వచ్చింది. ఈ భూములలో సుమారు 296 ఎకరాలు ఈనాం భూములుగా బయట వ్యక్తులు అధీనంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బ్రిటిష్‌ కాలంలోనే ఆలయం నోటిఫైడ్‌ టెంపుల్‌ గా నమోదై ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

దినదిన ప్రవర్ధమానంగా..

2011 వరకు దేవదాయ శాఖలో మేనేజర్‌ స్థాయి నుంచి గ్రేడ్‌–1 ఆలయంగా, 2023 నుంచి డిప్యూటీ కమిషనర్‌ స్థాయికి ఆలయం వృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ఆలయ చైర్మన్‌ పదవికి రాష్ట్ర స్థాయిలో పోటీ నెలకొంది. భక్తజన తాకిడి పెరగడంతో ఆలయంలో రూ.6.25 కోట్లతో వకుళ మాత అన్నదాన భవనం, రూ.2.8 కోట్లతో తెప్పోత్సవ కోనేరు, రూ.38 లక్షలతో రథశాల నిర్మాణాలు సాగుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆలయంలో అభివృద్ధిని పరుగులు పెట్టించడం గమనార్హం.

మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు

ఏడు శనివారాల వ్రతం చేస్తున్న వారితో పాటు నిత్య భక్తులతో రద్దీగా ఉన్న ఆలయం

ఖండాంతరాలు దాటుతున్న

వాడపల్లి వెంకటేశ్వరుని కీర్తి

ఏడు శనివారాలు, ఏడు ప్రదక్షిణలతో

అంతకంతకూ పెరుగుతున్న భక్తకోటి

అందుకు తగ్గట్టుగా

చురుగ్గా అభివృద్ధి పనులు

Advertisement
 
Advertisement
Advertisement