ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణంలోని సైదులు పేటకు చెందిన వివాహిత కానూరి భారతి (25) ఆదివారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో చీరతో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, తల్లి వడ్లమూరి మంగాదేవి కథనం ప్రకారం.. మండపేటలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న కానూరి ఫణీంద్రకు పిఠాపురానికి చెందిన భారతితో 2019 జూన్ 11న వివాహమైంది. వారికి ఇద్దరు అమ్మాయిలు. తరచూ ఫణీంద్ర మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఆర్థిక సమస్యలు సైతం పట్టి పీడించాయి. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారతి తన ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని పట్టణ ఎస్సై రాము పరిశీలించారు. మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తన కుమార్తె ఆత్మహత్యకు ఫణీంద్ర వేధింపులే కారణమని ఆమె తల్లి వడ్లమూరి మంగాదేవి ఆరోపించారు. ఇదిలా ఉండగా ఫణీంద్ర ద్వారపూడి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తాళ్లపూడి: కొవ్వూరు మండలం దేచర్ల వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దేచర్ల గ్రామానికి చెందిన మట్ట సత్యనారాయణ (40) క్రషర్ ఆడే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పంగిడిలో క్రషర్ వద్ద నుంచి దేచర్లకు మోటార్ సైకిల్‌పై అతనితో పాటు కోటి అనే వ్యక్తి వస్తుండగా ఆటో ఢీకొని వెళ్లిపోయింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కోటి తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోను కొందరు గుర్తించి కొవ్వూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భజే విఘ్నేశ్వరా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ చేశారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 26 మంది, లక్ష్మీ గణపతి హోమంలో 25 మంది భక్తుల పాల్గొన్నారు. 16 మంది వాహన పూజలు చేయించుకోగా, 3,783 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల రూపంలో రూ.3,56,433 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య


