అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
యానాం: స్థానిక భీమ్‌నగర్‌కు చెందిన మోర్త అబ్రహం (60) ఆదివారం తెల్లవారు జామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై శేరు నూకరాజు తెలిపారు. ఇందిరాగాంధీ మా ర్కెట్ కాంప్లెక్స్ ముఽఖద్వారం వద్ద తలకు తీవ్రగాయమై ఉన్న అబ్రహంను పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న హెచ్‌ఆర్ స్క్వేర్ సంస్థ సిబ్బంది గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ఽధ్రువీకరించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటకు సంబంధించి ఇప్పటికే హెచ్ ఆర్ స్క్వేర్ సంస్థకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్, సూపర్‌వైజర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు.


