
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అవగాహన
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం పరిధిలోని ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలలో పదోన్నతి పొందిన ఎంపీడీఓల శిక్షణ కొనసాగుతోంది. గత నెల 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 26 వరకూ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విస్తరణ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. చనిపొయిన వారితో పాటు గ్రామాన్ని విడిచి వెళ్లిన వారిని గుర్తించి తగిన ఆధారాలతో వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. దివ్యాంగులు పోలింగ్ బూత్‌లలోకి వచ్చేలా ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. 650 మంది ఓటర్లు మించిన సమయంలో మాత్రమే రెండవ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.