తుని: పాయకరావుపేట మండలం నామవరం–తుని రైల్వేస్టేషన్ మధ్యలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై ఎస్‌కే అబ్దుల్ మారూఫ్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలును గమనించకుండా పట్టాలు దాటుతున్న 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంగారపు రంగు ఫుల్ చేతుల చొక్కా, నీలం రంగు గడుల లుంగీ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు.
Feb 24 2023 11:42 PM | Updated on Feb 25 2023 12:56 PM
Advertisement
Advertisement