వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

ఉప్పలగుప్తం: మండలంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. బాధితుల వివరాల్లోకి వెళ్తే.. గోపవరానికి చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు కుంచే చిట్టిబాబు, బాబూరావులపై అదే గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కుంచే ప్రవీణ్‌ కత్తి, బీరు బాటిల్‌తో దాడి చేశాడు. చిట్టిబాబు, బాబూరావులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని అమలాపురం ఏరియా హాస్పిటల్‌కు వైఎస్సార్‌ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుంచే స్వామి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే ఘర్షణకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement