పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్‌ : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్‌ : కలెక్టర్‌

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. శనివారం అమలాపురం రూరల్‌ పరిధి ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఓటును నిబంధనల ప్రకారం జాగ్రత్తగా లెక్కించి, ఫలితాల ప్రకటనలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత మాధవి తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాన్ని అమలాపురం ఆర్డీఓ, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ)తో కలసి జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి.ప్రశాంతి పరిశీలించారు.

డీఎల్‌ఈడీ పరీక్షల

షెడ్యూల్‌ విడుదల

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎల్‌ఈడీ) 3వ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైందని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు శనివారం తెలిపారు. 2024 –26, 2023 – 25 బ్యాచ్‌లకు చెందిన రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షలు డిసెంబర్‌ 14 నుంచి 19వ తేదీ వరకు జరుగుతాయని, ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 16 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 20, 21 తేదీల్లో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.250, ప్రైవేట్‌ విద్యార్థులు సబ్జెక్టుల సంఖ్యను బట్టి ఒక సబ్జెక్టుకు రూ.125, రెండు సబ్జెక్టులకు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.175, నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.250 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను వేర్వేరుగా సమర్పించాలని, పరీక్ష ఫీజును గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement