టీడీపీ కార్యకర్తలతో ఓటర్‌ స్లిప్పుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తలతో ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

Nov 5 2026 12:16 AM | Updated on Nov 5 2026 12:16 AM

అమలాపురం రూరల్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్‌ స్లిప్పులను పంచాయతీ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, టీడీపీ కార్యకర్తలు పంపిణీ చేయడంపై బండారులంక గ్రామంలో బుధవారం వివాదం రేగింది. దీనిపై వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దంగేటి డోలమణి రుద్ర, నాయకులు కామిశెట్టి శ్రీను, సరేళ్ల రామకృష్ణ, జాన్‌గణేష్‌, కార్యకర్తలు స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను నిలదీశారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో స్లిప్పుల పంపిణీకి ఇతరుల సహకారం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పడంపై మండిపడిన వైఎస్సార్‌ సీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) అన్యం రాంబాబు హుటాహుటిన గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. కార్యకర్తల వద్ద ఉన్న ఓటర్‌ స్లిప్పులను స్వాధీనం చేసుకోవాలని కార్యదర్శిని ఎంపీడీవో ఉండ్రు బాబ్జీరాజు ఆదేశించారు. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement